నాలుగు సంవత్సరాల బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం మధ్యాహ్నం మంచిర్యాలలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే దండేపల్లి మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన బొడ్డు అనిరుద్ నాలుగు సంవత్సరాల బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగానే అనిరుద్ అరగంటకే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.