ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు 33 మంది లబ్ధిదారులకు 27 లక్షల 38వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఎన్టీఆర్ హెల్త్ ద్వారా సహాయం అందించడమే కాకుండా ఆ అవకాశం లేని పేదలకు సీఎం సహాయ నిధి నుండి కూడా అవసరాలను తీర్చడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎన్నికల హామీలను తూచా తప్పక అమలు చేస్తుందన్నారు