మధురవాడ శివశక్తి నగర్ స్మశానం ఎదురుగా ప్రభుత్వ స్థలంలో కొంత భూమి ఇటీవల అక్రమణకు గురయ్యింది. అక్రమనకు గురయ్యిన భూమిపై రెవెన్యూ ఉన్నత అధికారులకు స్థానికులు పిర్యాదు చేసారు. ఆ పిర్యాదులు పై స్పందించిన మధురవాడ రెవెన్యూ అధికారి కిషోర్ తక్షణమే ప్రభుత్వ భూమిలో ఆక్రమణ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని సచివాలయం విఆర్ఓ ప్రియాంక కు ఆదేశాలు జారీ చేసారు. ఆర్ ఐ కిషోర్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం స్థానిక సచివాలయం విఆర్ఓ ప్రియాంక మరో విఆర్ఓ వంశీ సహకారంతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సాయంతో పూర్తిగా తొలగించారు.