శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం నల్లచెరువు మండల పరిధిలోని కమ్మర వారి పల్లిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయ తలుపులను పగలగొట్టి హుండీను చోరీ చేశారు. హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయం వద్దకు వచ్చిన కమిటీ సభ్యులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.