ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ కు అర్హత, ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం తెలిపారు. 12 నెలలు ఉచితంగా ఇంటర్న్ షిప్ ఇస్తారన్నారు. 21 నుంచి 24 సంవత్సరాల వయసున్నవారు డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలన్నారు. సంబంధిత సంస్థల ద్వారా స్టైఫండ్ అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.