కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజు పాలెం అడ్డ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తున్న కారు విన్నకోట సాంబశివరావు బైకును వెనుక నుండి ఢీకొనడంతో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందారు మరో బైకు టాటా ఏసీ ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు ఈ ఘటనపై పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు