కన్నతల్లి మందలించిందని మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పట్టణంలోని NSR కాలనీకి చెందిన రావినూతల మునుస్వామి చెడు వ్యసనాలకు, మద్యం త్రాగుడుకు అలవాటు కావడంతో.. అతని తల్లి రావినూతల శ్యాము మందలించింది. దీంతో మునుస్వామి మనస్థాపం చెంది ఈనెల 20వ తేదీ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గుర్తించి అతన్ని నెల్లూరులో వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ పేరుకు మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు