ఈనెల 7న రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని అహోబిలం పుణ్యక్షేత్రంలోని అన్ని ఆలయాలను మూసివేస్తున్నట్లు దేవస్థానం మణియార్ సౌమ్య నారాయణ తెలిపారు. ఎగువ, దిగువ, నవ నరసింహ క్షేత్రాలలోని ఆలయాలన్నింటినీ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తామన్నారు. 8వ తేదీ ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరిచి భక్తులకు శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.