-జిల్లా కేంద్రంలోని త్రిషూల్ గణపతి, గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవ పూజలు, మహిళలచే దాండియా రెండవ రోజు శనివారం సాయంత్రం 6 గంటలనుండి వినాయక నిమజ్జనం శోభయాత్ర ఘనంగా సాగుతుంది. పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తా మీదుగా ప్రధానవ్యాపార కూడలి టవర్ గుండా చింతకుంట వైపు నిమజ్జనం కోసం సాగుతున్న వినాయకులకు గణేశ ఉత్సవ సమితి బృందం మంగళహారతులతో ఘనంగా స్వాగత్తిస్తూ, గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు.కాగా,జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్, బైపాస్ గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవ సందర్భంగా గణేష్ విగ్రహ నిమజ్జనం మరియు దాండియా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.