నంద్యాలలో మంగళవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో పౌరోహిత్య వృత్తి చేస్తున్న సాయినాథ్ శర్మ, తన భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. భార్య పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్షణికావేశంలో భర్త ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.”