హల్దీ వాగులో భారీగా పెరుగుతున్న వరద ఉద్ధృతి మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని హల్దీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నిన్న ఉదయానికి 9 సెంమీ వర్షపాతం నమోదు కాగా, గురువారం ఉదయానికి 13 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది, తూప్రాన్ మండలంలో 22 సెంమీ వర్షం కురవడంతో హల్దీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూప్రాన్, కిష్టాపూర్ మార్గంలో కాజ్ వే మీదుగా మూడు మీటర్ల ఎత్తులో హల్దీ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.