గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నారాయణఖేడ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలు రోడ్లపై నీరు ప్రవహిస్తుందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. వాగులు ప్రవహించే రహదారుల వద్ద ప్రవాహం తగ్గాక మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.