ఆళ్లగడ్డలో జీవిత బీమా సంస్థ శాటిలైట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 69వ బీమా వారోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ నెల 1 నుంచి జీవిత బీమా సంస్థ వారోత్సవాలు ప్రారంభమయ్యా యిన్నారు. మార్కెట్లో ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉన్నప్పటికీ ఎన్ఐసీ సంస్థకు ఏదీ ధీటుగా రాదన్నారు. పాలసీదారుల నమ్మకానికి ప్రతీక అయిన LIC సంస్థకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉందన్నారు.