యాదమరి మండలంలోని హోప్ చిల్డ్రన్స్ హోమ్, పుల్లయ్యగారి పల్లి లో ఉన్న ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. తప్పిపోయిన వారు శక్తి వేలు (12), చిన్నారుసు (10). వీరు ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుండి కనిపించలేదని హోమ్ ఇన్‌చార్జ్ గాడ్లిన్ యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాదమరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరి గురించి తెలిస్తే సమాచారం అవ్వాలని ఎస్ఐ ఈశ్వర్ 9440900684 తెలిపారు