ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కె.పార్వతమ్మ గురువారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదన్ ఆచారి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.