దేవరకద్ర మండల పరిధిలోని చిన్న రాజమూరు గ్రామంలో గురువారం రాత్రి 7 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.ఈదురు గాలతో అతి భయంకరంగా వర్షం రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.మరో పక్క అకాల వర్షానికి రైతన్నలు వరి పంటలను అప్రమత్తం చేసుకున్నారు. సరైన సమయంలో వరి పంటలు కోతకోసే సమయానికి అకాల వర్షం రావడంతో కొంతమంది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.అంతేకాక వర్షానికి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.