విజయవాడ గుణదల ప్రాంతంలోని కాలువ కి ఆనుకొని ఉంటున్న నివాసాలను అధికారులు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం సమయంలో అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా తమ నివాసాలను తొలగించడం దారుణమని బాధితులు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు రోడ్డుమీద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.