రేస్ బైక్ లపై వచ్చి సెల్ ఫోన్ లను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెల్లడించారు. గురువారం రాత్రి ఒక ప్రకటన ద్వారా ఎస్సై వెంకట్ మాట్లాడారు ఇరువురు నిందితుల్లో ఒక మైనర్ యువకుడు ఉన్నట్లు తెలిపారు. గుంటూరు నుండి మంగళగిరి కి ఆటోలో వస్తున్న మల్లేపల్లి మునుస్వామి వద్ద రేస్ బైక్ లపై వచ్చిన ఇరువురు నిందితులు సెల్ ఫోన్ లాక్కొని పారిపోయినట్లు తెలిపారు. వెంటనే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. గుదే మహేష్ తోపాటు మైనర్ బాలుడును అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.