కల్లూరు అర్బన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో మంగళవారం ఐద్వా మహిళా సంఘం విస్తృత సమావేశం జరిగింది. మహిళల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఐద్వా నగర కార్యదర్శి కే.అరుణ పిలుపునిచ్చారు. మహిళలపై దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 10 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.