కళ్యాణదుర్గం 2012లో మున్సిపాలిటీ గా మారింది. అయితే మున్సిపాలిటీ అయ్యాక ఒక్క రోడ్డు కూడా వేయలేదని పంచాయతీ రోడ్లే కొనసాగుతున్నాయని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళ్యాణదుర్గం లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నానన్నారు. మాస్టర్ ప్లాన్ తో కళ్యాణదుర్గం రూప రేఖలే మార్చివేస్తానన్నారు. నా స్వార్థం ఏమీ లేదని అయితే ప్రజలను అభివృద్ధి చేయడమే నా స్వార్థమన్నారు.