ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉండాలని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీ ల అభివృద్ధి పనుల సమీక్ష సమావేశము లో పేర్కొన్నారు. శుక్రవారం సాయంకాలం 6 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఆసుపత్రిలో వెహికల్ పార్కింగ్ ఈనెల 30 తారీఖు లోపల, ట్రాలీ ట్రాక్ ను అక్టోబర్ 15 లోపల పూర్తి చేయాలని ఏపీఎంఐడీసీ అధికారు