పల్నాడు జిల్లాలో రేపటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా అచ్చంపేట సీఐ పోలూరి శ్రీనివాసరావు, ఎస్ ఐ వెంకటేష్ బాబు మంగళవారం సాయంత్రం 6గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేయనున్న మండపాలకు అనుమతులు తప్పనిసరి అని, ప్రతి గ్రామంలోనూ వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అచ్చంపేటలోని మూడు ప్రాంతాలలో వినాయకుని నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేసారు.