అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్ కాలనీలో ఆశ్రమం హాండ్స్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా ఉచిత వైద్య శిబిరాలను ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.