నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం బీమునిపాడు వద్ద శుక్రవారంబైకును బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న గడ్డం రవీంద్ర (30) మృతి చెందాడు. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన రవీంద్ర టైలర్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. క్రిష్టిపాడులో పని ముగించుకొని కోవెలకుంట్లకు వస్తుండగా అటుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.