రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కొరతను అధిగమించేలా చర్యలు చేపట్టాలని సీపీఐ బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులకు సంఘీభావంగా ఈనెల 8న బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు. సుబ్బారెడ్డి, శివ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.