కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని మల్ల కత్తువ వద్ద వినాయకుడి నిమజ్జనానికి పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ తన సొంత నిధులతో పోలీస్ వారి సహకారంతో సర్వం సిద్ధం చేస్తున్నారు. పోరుమామిళ్ల తదితర ప్రాంతాల నుండి వేలాది వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు మల్లకత్తవలో ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా జెసిపితో కంపచెట్లు తొలగించి అక్కడ జనరేటర్, లైటింగ్ ఏర్పాట్లతో క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి సర్వం సిద్ధం చేస్తున్నారు.