నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో గల మద్యం దుకాణంలో మద్యం సేవించేందుకు వచ్చిన వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. శ్రీపురం రోడ్డులో గల మద్యం దుకాణానికి మద్యం సేవించేందుకు వచ్చిన వ్యక్తి దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే మద్యం సేవిస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.