ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకున్నారు. భాకరాపురం హెలిపాడ్ వద్ద నుంచి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. జగన్ ను కలవడానికి వచ్చిన పలువురు వైకాపా నాయకులను కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.