నా కొడుకును దారుణంగా కొట్టారు. నిన్న వెళ్లి చూడకపోతే చనిపోయి ఉండేవాడంటూ మలికిపురం (M) శంకరగుప్తానికి చెందిన గుర్రం లక్ష్మీకుమారి రాజోలులో మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. మోరంపూడి ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో తోటి విద్యార్థుల చేతిలో కొడుకు విన్సెంట్ ప్రసాద్ చిత్రహింసలకు గురైన తీరును వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 3 నెలల కిందట తన భర్త చనిపోయాడని తన బిడ్డపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు.