భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు కర్నూలు నగర వ్యాప్తంగా బుధవారం వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వినాయక ఆలయాలు, మండపాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైంది. పెద్దలు, చిన్నవారు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ వినాయకుని దర్సించుకోవడానికి బారులు తీరారు.నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఉత్సవ సమితి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పూలతో, పండ్లతో అలంకరణలు చేసి, గణపతి హోమాలు, వేద పఠనాలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానాలను పంపిణీ చేశారు. కొందరు సామూహిక సాంస్కృతిక కార్యక్రమాల