జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు గంటల సమయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.శీను తదితరులు పాల్గొన్నారు.