కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులను, విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉందని చివరికి కడుపుకు అన్నం పెట్టే రైతును కూడా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో సబ్సిడీ ఎరువుల పంపిణీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ,కొంతమంది బ్లాక్ మార్కెట్కు ఎరువులు తరలించి రైతులు అన్యాయం చేస్తున్నారంటూ వైకాపా ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం చేపట్టారు.