శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 2వ రోజు గురువారం సాయంత్రం నిర్వహించిన ఓనం వేడుకల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ పాల్గొన్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని ఆయన దర్శించుకున్నారు. సత్యసాయి బాబా దేశంలో చేసిన సేవలను కొనియాడారు. కావ్య & అజిత్ బృందం గాన కచేరి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది. అనంతరం సత్యసాయిబాబా కీర్తనలు ఆలపించి, మంగళ హారతితో కార్యక్రమం ముగిసింది.