గుంటూరు నగరంలో కలుషిత నీటి విక్రయాలు చేస్తున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేసినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 120 మినరల్ ప్లాంట్ లలో త్రాగునీటి శాంపిల్స్ ను మంగళగిరిలోని ఐపిఎంపిహెచ్ ల్యాబ్ అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజీలోని రీజినల్ ల్యాబ్ కు పంపించి పరీక్షించగా 21 ప్లాంట్లలో విక్రయిస్తున్న నీరు త్రాగటానికి వీలులేని బ్యాక్టీరియాని కలిగి ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందిందన్నారు. గురువారం సాయంత్రం ప్రజారోగ్య విభాగ అధికారులు 21 మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేయడం జరిగిందన్నారు