సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో విచారించి ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం హైదరాబాదులోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.