కొత్తూరు మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని శనివారం గొట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా రవాణా సౌకర్యాలు లేక గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో ఆర్టీసీ అధికారులు గుట్టపల్లి, పూతికవలస, హడ్డుబంగి తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆయన కోరారు