యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలోని పల్లె దావకారణం చౌటుప్పల్ ఎంపీడీవో బొజ్జ సందీప్ కుమార్ సోమవారం సందర్శించారు. పల్లె దావఖానలో మందుల స్టాక్ చికిత్స సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు.అంతకుముందు గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కార్యదర్శి చింతల శ్రీకాంత్ ,వైద్యురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.