అద్దంకిలోని పశువుల వైద్యశాల నందు శుక్రవారం డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంచాలకులు బ్రహ్మయ్య పాల్గొని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ నుంచి పశువులకు గాలికుంటు నివారణ టీకాల గురించి చర్చించారు. రైతుల వద్దకు నేరుగా వెళ్లి టీకాలు వేయాలని ఆయన పేర్కొన్నారు. పశువుల పోషకులకు దాన అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.