తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నాయుడుపేట పట్టణ సమీపంలోని మల్లాం జంక్షన్ వద్ద గురువారం నాగముంతల మణికంఠ, పెళ్ళకూరు శ్రావణ్ కుమార్ లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రెండు మోటర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన బైకు దొంగలు ఇద్దరినీ నాయుడుపేట కోర్టుకు హాజరు పరిచినట్లు నాయుడుపేట పట్టణ సీఐ బాబి తెలియజేశారు. బైక్ దొంగలకు నాయుడుపేట జడ్జి రిమాండ్ విధించినట్లు సి ఐ తెలిపారు.