ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను ఎంపీడీవో శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తడి చెత్త 60 రోజులు ఉంచి ఆ తర్వాత అందులో నుండి వర్మితోట్లను తరలించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సిబ్బందికి సూచించినట్లు ఎంపీడీవో తెలిపారు. సిబ్బందికి విధుల యందు నిర్లక్ష్యం పనికిరాదని దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పారుశుద్ధ్య సిబ్బంది నెలకు మూడు టన్నుల తడి చెత్త సేకరించవలసిందిగా ఆదేశించారు.