అక్రమంగా గంజాయి పండించి,అమ్ముతున్న వ్యక్తిని సోమవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బనర్ కోసార్ గ్రామానికి చెందిన జట్టి అనిరుధ్ గంజాయి సాగు చేస్తూ, విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తన పంటపొలంలో తనిఖీలు చేయగా 8 గంజాయి మొక్కలతో 440 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.