అల్లూరి జిల్లా పాడేరు పి ఎం ఆర్ సి కార్యాలయం ఎదుట నూతిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో నూతి వద్ద బట్టలు ఎందుకు వెళ్ళిన స్థానికులు నూతిలో మృతదేహాన్ని తేలియాటం చూసి ఆందోళన చెందారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం పాడేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న మూర్తి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఒంటరిగా తిరుగుతున్నాడని అతనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.