నిర్వాసిత నాయకులు స్వర్గీయ పులి అప్పల రెడ్డి మూడో వర్ధంతి కార్యక్రమాన్ని పెదగంట్యాడ నేల్లిముక్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా మాజీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విచ్చేసి అప్పల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పల రెడ్డి జీవితం సగం నిర్వాసితులకే అంకితం ఇచ్చారని నిర్వాసితులకు ఎన్ని ఎటువంటి అన్యాయం జరిగినా ఊరుకునే వారు కాదని వారి హక్కుల గురించి ఎన్నో పోరాటాలు నడిపిన వ్యక్తి అప్పల రెడ్డి అని అప్పలరెడ్డి లోని లోటు ఇప్పటికీ తెలుస్తుందని అన్నారు.