వాజేడు మండలంలోని మురుమూరు గ్రామంలో దారెల్లి అమ్మవారి జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజారులు సమీప అడవి నుంచి వనాన్ని తీసుకువచ్చారు. కాగా నేడు సాయంత్రం సమీపంలోని జెండా గుట్టపై నుండి పెద్దదేవర గద్దెకు చేరుతుందన్నారు. రేపు శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, అనంతరం అమ్మవారిని వన ప్రవేశం చేయనునట్లు తెలిపారు.