వినాయక చవితి సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం ఉత్సవాలు సాంప్రదాయ బద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు భీమవరం వన్ టౌన్ పోలీసులు నమూనా గణేష్ నిమజ్జన ఊరేగింపును మట్టి విగ్రహంతో నాదస్వరం, సన్నాయి మేళాలతో సాంప్రదాయంగా ఆదివారం సాయంకాలం ఆరు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా ఉండాలని గొడవలకు తావు లేకుండా డీజే సౌండ్స్, రంగులు పూసుకోవడం వట్టి వాటికి దూరంగా సాంప్రదాయ బద్ధంగా చేయాలని దీని కోసం పోలీసు సిబ్బందితో నమూనా ఊరేగింపు నిర్వహించామని తెలిపారు.