ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పలు లాడ్జిలలో ఎస్సై వేమన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు వ్యభిచార కేంద్రాలుగా మారాయి అన్న సోషల్ మీడియా కథనంపై వెంటనే ఎస్ఐ స్పందించారు. ఎస్ఐ మాట్లాడుతూ... తనిఖీలో ఎలాంటి వ్యభిచారం జరగటం లేదని నిర్ధారించారు. చట్ట వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మీదట ప్రతిరోజు లాడ్జిలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.