సెక్యులర్, డెమోక్రసీ పాలన కోరుకున్న ఉత్తమ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి సెక్యులర్, డెమోక్రసీ పాలన కోరుకున్న ఉత్తమ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి భవనంలో సిపిఐ(ఎం) అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు