ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఐ నిరసన శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని నిరసిస్తూ ఎంపీడీవో పద్మజాకు వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఐ రైతులకు మద్దతుగా ఉంటుందన్నారు. ఖరీఫ్ పంట మొదలవుతుంటే అందుబాటులో ఉంచాల్సిన యూరియాను అందుబాటులో ఉంచకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.300 అమ్మాల్సిన యూరియాను రూ.450 అమ్ముతున్నారని ఆరోపించారు.