వికారాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారి అలుగు పారి రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నాయి. అందులో భాగంగా కోట్పల్లి ప్రాజెక్టు అలుగు నాగసముద్రం గ్రామం వద్ద రహదారిపై నుంచి పాడడంతో, దారుల నుంచి పెద్దెములు నాగసముందర్ వెళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ప్రజలు ఎక్కడికి అక్కడే ఆగిపోయారు. వాగులు దాటి ప్రయత్నం చేయొద్దని దారుర్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు.