మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి వాసుకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని, వర్షం వస్తే నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదని సమస్యను పరిష్కరించాలని కోరారు.